Corona in Hyderabad (photo-Youtube grab)

Hyderabad, July 15: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసులు (Coronavirus in Hyderabad) వేగంగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో (GHMC) పెరుగుతున్న కోవిడ్-19 కేసులు ప్రజలను మాత్రమే కాకుండా అధికారులకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రకాల ప్రాథమిక పరిశోధనలు తరువాత కరోనావైరస్ (COVID 19) తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తెలంగాణలో మరో 1524 పాజిటివ్ కేసులు, 10 కరోనా మరణాలు నమోదు, రాష్ట్రంలో 37 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య; గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్ కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌ దశకు వచ్చినప్పటికీ ప్రజల అజాగ్రత్త, నిబంధనల ఉల్లంఘన వల్ల కేసుల పెరుగుదలకు దారి తీసిందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలతో పోలిస్తే నగర ప్రజలు మరింత అజాగ్రత్తగా ఉంటున్నారు. చాలా రోజులుగా జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున 1000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 13 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిమితుల్లో 14959 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ నెలలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లో రికార్డు స్థాయిలో 29,429 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, ఇప్పటివరకు 5,92,032 మంది డిశ్చార్జ్

మార్చి నుంచి జూన్ వరకు జీహెచ్‌ఎంసీలో 9262 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 13 రోజుల్లో ఇది రికార్డు స్థాయిలో 14959 కు పెరిగింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఈ సంఖ్యలే నిదర్శనంగా చెప్పవచ్చు. జీహెచ్‌ఎంసీలోని దాదాపు అన్ని ప్రాంతాలు కరోనావైరస్‌తో ప్రభావితమయ్యాయి. మార్చిలో జీహెచ్‌ఎంసీలో కేవలం 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 527 కు పెరిగింది. మేలో కేసులు 1000 మార్కును దాటాయి. జూన్‌లో 7654 కేసులు నమోదయ్యాయి. ఈ 13 రోజుల స్వల్ప కాలంలోనే సుమారు 14959 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.