Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Hyderabad, Nov 15: తెలంగాణలో గత 24 గంటల్లో 661 కరోనా కేసులు (Coronavirus Outbreak) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,637 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374 కి ( COVID cases in Telangana) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మృతుల సంఖ్య మొత్తం 1,404 కి చేరింది. ప్రస్తుతం 15,425 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 12,888 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 167 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

చలి తీవ్రతతో కరోనా తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని రాబోయే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. కరోనా టీకా సహా జనవరి, ఫిబ్రవరి నాటికి శాశ్వత వైద్య చికిత్స కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రోజుకు 8 వేల నుంచి 9 వేల కరోనా కేసులు, 80 నుంచి 90 వరకు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం, చలి వల్ల ఢిల్లీలో వైరస్‌ తీవ్రత ఉందని వెల్లడించారు.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్..తోడయిన కాలుష్యం, దేశంలో తాజాగా 44,684 కొత్త కేసులు నమోదు, 87,73,479కు చేరిన మొత్తం కేసుల సంఖ్య, డిసెంబర్‌లో అందుబాటులోకి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

అమెరికాలో 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. బాధ్యతారహితంగా ఉన్నచోట వైరస్‌ ఉధృతి పెరుగుతోంది. 90 శాతం వైరస్‌ వ్యాప్తికి కారణం ముక్కు, నోరే.. కాబట్టి మాస్క్‌ను ఆ రెండూ కవరయ్యే లా చూడాలని తెలిపారు. రాబోయే కోవిడ్‌ టీకాలు కూడా ఏ మేరకు సమర్థంగా పనిచేస్తాయో స్పష్టత లేదు. కాబట్టి టీకా కోసం ఎదురుచూడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు.