Hyderabad, Oct 29: హైదరాబాద్ (Hyderabad) లోని యాకుత్ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి (Firecracker Explodes In Hyderabad) ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో బాణసంచా నిల్వలు ఉంచుకోవద్దని నగరవాసులకు పోలీసులు సూచించారు.
Here's Video:
హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం
యాకత్ పురా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన టపాసులు(ఫైర్ క్రాకర్స్) మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది .ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు .ఈ ఘటన రెన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో… pic.twitter.com/3Tswrbywrx
— ChotaNews (@ChotaNewsTelugu) October 29, 2024
ఎలా జరిగిందంటే?
ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దంపతులిద్దరూ దీపావళి పండుగ సందర్భంగా స్థానికంగా బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో బాణసంచా నిల్వలను ఉంచారు. రాత్రి ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి, బాణసంచాకు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి.