Covid-19 in TS: తెలంగాణలో 70 వేలు దాటిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 2,012 కొత్త కేసులు నమోదు, ఇప్పటివరకు 576 మంది కోవిడ్‌తో మృతి
Coronavirus Outbreak in India (Photo-PTI)

Hyderabad, August 5: తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2012 పాజిటివ్ కేసులు (New Corona Cases) న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 70,958 మందికి (Covid-19 in TS) క‌రోనా వైర‌స్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌రకు కొత్త‌గా 13 మంది బాధితులు మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాతో 576 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 1139 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 50,814కి చేరింది. కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు, దేశంలో కొత్తగా 52,509 మందికి కోవిడ్-19, భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 523 కేసులు న‌మోద‌వ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 198 కేసులు, రంగారెడ్డిలో 188, వ‌రంగ‌ల్‌లో 127, ఖ‌మ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌లో 83, కామారెడ్డిలో 75, కొత్త‌గూడెం జిల్లాలో 52, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 51, న‌ల్ల‌గొండ‌లో 49, గ‌ద్వాల‌లో 48, భూపాల‌ప‌ల్లిలో 46, పెద్ద‌ప‌ల్లిలో 41, క‌రీంన‌గ‌ర్‌లో 41, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 36, సిద్దిపేట‌లో 28, వ‌రంగ‌ల్ గ్రామీణ‌లో 28, జ‌గిత్యాల‌లో 27, సూర్యాపేట‌లో 27, భువ‌న‌గిరిలో 26, మెద‌ర్‌లో 21, వ‌న‌ప‌ర్తిలో 20, ములుగులో 18, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 19, ఆదిలాబాద్‌లో 15, సిరిసిల్ల‌లో 10, నిర్మ‌ల్‌లో 9, వికారాబాద్‌లో 6, నారాయ‌ణ‌పేట‌లో 4, మంచిర్యాల‌లో ఒక క‌రోనా కేసు న‌మోద‌య్యింది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభు త్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను సర్కారు పెంచింది. వివిధ ఆస్పత్రుల్లో అన్ని రకాల పడకల సంఖ్య 17,081 ఉండగా వాటిని 20,396కు పెంచింది. ఈ మేరకు అదనంగా 3,315 పడకలు అందుబాటులోకి వచ్చాయి. పెంచిన పడకల్లో ఆక్సిజన్‌ పడకలే 2,324 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాల్లో వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో జిల్లా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.