Coronavirus in India | (Photo Credits: PTI)

Hyderabad, August 17: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus Cases) నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు (Telangana Coronavirus Deaths) చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,420 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,53,349 కరోనా టెస్టులు నిర్వహించారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో 8794 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 51 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది.

భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్‌ అర్బన్‌జిల్లాలో 44, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్‌ జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, జనగామా జిల్లాలో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, నల్గొండ జిల్లాల్లో 37, కామారెడ్డి జిల్లాల్లో 7, సిద్దిపేట జిల్లాల్లో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62 , సూర్యాపేట జిల్లాల్లో 12, నిజమాబాద్‌ 38, మహబూబాబాద్‌ జిల్లాల్లో 31 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల మొదటి నుంచి కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం హైదరాబాద్‌లో 234 కేసులు మాత్రమే వచ్చాయి. ఈ నెలలో ఇవి అతి తక్కువ. గత 16 రోజుల్లో నమోదైన కేసులు 7,540 మాత్రమే. కాగా, హైదరాబాద్‌లో ఈ నెల 3వ తేదీన 273, 4న 391, 10న 389, 11న, 328, 13న 298, 14న 356 కేసులు వచ్చాయి. మిగతా రోజుల్లో 400 నుంచి 580లోపు నమోదయ్యాయి. ఈ నెలలో రోజువారీ సగటున 475 మందికి వైరస్‌ సోకింది