Telangana COVID-19: వరంగల్‌లో ఒకే చితిపై నాలుగు మృతదేహాల దహనం, తెలంగాణలో మరో 1,811 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 60,717కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Hyderabad,July 30: తెలంగాణ రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు (Telangana COVID-19) న‌మోద‌వ‌గా, 13 మంది మృతి (Covid-19 Deaths) చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కు పెరిగారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేర‌కు రాష్ట్ర వైద్య‌ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. చపాతీలో విషం పెట్టి జడ్జిని చంపేసిన మహిళ, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన, మహిళతో సహా ఆరుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో (GHMC) 521 పాజిటివ్‌లు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చ‌ల్‌లో 151, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 102, క‌రీంన‌గ‌ర్‌లో 97, న‌ల్ల‌గొండ‌లో 61, నిజామాబాద్‌లో 44, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 41, మ‌హ‌బూబాబాద్‌లో 39, సూర్యాపేట‌లో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్ల‌లో 30, గ‌ద్వాల‌లో 28, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 27, ఖ‌మ్మంలో 26, సిద్దిపేట‌లో 24, వ‌న‌ప‌ర్తిలో 23, జ‌న‌గామ‌లో 22, పెద్ద‌పెల్లిలో 21, భూపాల‌ప‌ల్లిలో 20, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 18 చొప్పున పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. జల వివాదం, ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

ఇక రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి పట్ల అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. తాజాగా వరంగల్ లో కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను ఒకే చితిపై దహనం చేశారు. స్థానిక పోతన శ్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు చితులపై తొమ్మిది కంటే ఎక్కువ శవాలను తగలబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి స్పందించారు. సిబ్బంది కొరత, కట్టెల కొరత వల్లే ఒకే చితిపై ఎక్కువ శవాలను దహనం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆలస్యమైతే శవాలు డీకంపోజ్ అయిపోతాయని... అందుకే సామూహిక దహనాలు చేస్తున్నామని తెలిపారు. దహన కార్యక్రమాలకు మృతుల సొంత కుటుంబీకులే రావడం లేదని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏం చేయగలమని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే మృతుల అంత్యక్రియలను నిర్వహిస్తున్నామని తెలిపారు.