New Covid Strain in TS: తెలంగాణను వెంటాడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ భయం, యూకే నుంచి వచ్చిన 18 మందికి కోవిడ్ పాజిటివ్, రాష్ట్రంలో తాజాగా 472 మందికి కరోనావైరస్ పాజిటివ్
Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, Dec 27: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 472 కరోనా కేసులు (Covid in TS) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 509 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,863కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 2,76,753 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,579 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో4,426 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే కొత్త కరోనా స్ట్రెయిన్ భయం ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana Coronavirus) వీడలేదు. యూకే నుంచి వచ్చినవారిలో అనుమానిత పాజిటీవ్ కేసులు (New Covid Strain in TS) పెరుగుతున్నాయి. మరోవైపు యూకే నుంచి వచ్చిన వారిలో ఇంకా 184 మంది ఆచూకీ దొరకలేదు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొత్త కరోనా అటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారు మనుషుల్ని చంపి తినేస్తున్నారా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తను నమ్మకండి, ఆ ఫోటో బుల్లెట్ల వర్షానికి గురైన బాధితులకు వైద్యం అందిస్తుండగా తీసింది..

యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించిన అధికారులు.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వారిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో కొత్తగా మరో ఇద్దరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతొ ఇప్పటి వరకు 18 మందికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.

ఓ వైపు కొత్త కరోనా స్ట్రెయిన్ అలజడి, మరోవైపు భారీగా తగ్గిన కేసులు, దేశంలో తాజాగా 18,732 మందికి కోవిడ్ పాజిటివ్, కరోనా చివరి సంక్షోభం కాదని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొత్త రకం వైర్‌సతో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సంచాకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు కోరారు. 9వ తేదీ తర్వాత యూకే నుంచి రాష్ట్రానికి నేరుగా, లేదా యూకే మీదుగా వచ్చినవారు వివరాలను 040-24651119 నంబరుకు ఫోన్‌ చేసి లేదా 91541 70960 నంబరుకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తారన్నారు.