Hyderabad, July 16: తెలంగాణలో కొవిడ్ విజృంభన కొనసాగుతుంది, నిత్యం వెయ్యి, రెండు వేలుగా నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజుతో 41 వేలు దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1676 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 41,018 కి చేరుకుంది.
అయితే ఇందులో 90 శాతంకు పైగా కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదైనవి ఉన్నాయి, కానీ ఇటీవల కాలంగా జిల్లాల్లోను కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూపోతున్నట్లు ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం స్పష్టమవుతోంది.
గురువారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 788 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 224 కేసులు, మేడ్చల్ నుంచి 160, సంగారెడ్డి నుంచి 57 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.
TS's COVID Bulletin:
District Wise COVID Cases
మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 396 కు పెరిగింది.
ఇక గురువారం సాయంత్రం వరకు మరో 1296 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 27,295 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. డిగ్రీ, పీజీ మరియు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు త్వరలో పరీక్షలు
గత 24 గంటల్లో 14,027 సాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 2,22,693 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.