Hyderabad, Oct 18: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్-19 పాజిటివ్ కేసులు (COVID19 in Telangana) నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా కోవిడ్-19తో 1,271 మంది (Coronavirus Deaths) మృతిచెందారు. శనివారం నాటికి రాష్ట్రంలో 22,050 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజు వ్యాధి నుంచి 2,154 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో కలిపి రాష్ట్రంలో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,98,790గా ఉంది. దేశవ్యాప్త రివకరీ రేటు 88 శాతంగా ఉండగా అదే రాష్ట్రంలో 89.5 శాతం ఉంది.
అయితే రాష్ట్రంలో కొత్తగా వైరస్ బారిన పడేవారికంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజు 40 వేల పైచిలుకు పరీక్షలు చేస్తుండగా.. 2 వేలలోపే కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి కొత్తగూడెం-77, జీహెచ్‌ఎంసీ-249, జగిత్యాల-27, జనగాం-21, భూపాలపల్లి-18, గద్వాల్-11, కామారెడ్డి-34, కరీంనగర్-76, ఖమ్మం-78, ఆసిఫాబాద్-16, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో 30 చొప్పున, మంచిర్యాల-23, మెదక్-20, మేడ్చల్ మల్కాజ్‌గిరి-105, ములుగు-21, నాగర్‌కర్నూలు-24, నల్లగొండ-75, నారాయణపేట-3, నిర్మల్-21, నిజామాబాద30, పెద్దపల్లి-20, సిరిసిల్ల-27, రంగారెడ్డి-110, సంగారెడ్డి-34, సిద్దిపేట-67, సూర్యాపేట-28, వికారాబాద్-25, వనపర్తి-21, వరంగల్ రూరల్-24, వరంగల్ అర్బన్-59, యాదాద్రి భువనగిరిలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి