COVID in TS: తెలంగాణలో మళ్ళీ కోవిడ్ విజృంభించే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలంటున్న ఆరోగ్య నిపుణులు, రాష్ట్రంలో కొత్తగా మరో 165 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,97,278కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 19....
Hyderabad, February 19: తెలంగాణలో మళ్లీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ, వైరస్ పూర్తి ఇంకా జనాల మధ్య నుంచి వెళ్లిపోలేదు. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతుంది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో మళ్లీ భారీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ పరిస్థితులు ఏర్పడవచ్చని, ప్రజలు మాస్క్, భౌతిక దూరంతో పాటు ఇతర అన్ని కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 23,761 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 165 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 440 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,97,278కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 19, రంగారెడ్డి నుంచి 13, మరియు కరీంనగర్ జిల్లా నుంచి 13 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,623కు పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మరో 149 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,93,940 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1715 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు టీకా పంపిణీ శుక్రవారం కూడా కొనసాగనుంది. అలాగే ఇప్పటివరకు టీకా వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 19, 2021 09:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

