Telangana: తెలంగాణలో కొత్తగా మరో 17 పాజిటివ్ కేసులు నమోదు, 1061కి చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, రెడ్ జోన్లపై సర్కార్ సీరియస్ నజర్, కేంద్రం తాజా లాక్డౌన్ మార్గదర్శకాలపై రాష్ట్రంలో వీడని సస్పెన్స్
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, May 3: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 కేసులు మరియు రంగారెడ్డి జిల్లా నుంచి 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య 1061 కి చేరింది. నిన్న మరొకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్19 మరణాల సంఖ్య 29కి పెరిగింది.

శనివారం మరో 35 కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 499 మంది కోవిడ్ బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 533 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

COVID-19 Media Bulletin- Telangana:

 

Status of positive cases of #COVID19 in Telangana

తెలంగాణ జిల్లాల్లో కరోనావైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రాష్ట్రంలో రెడ్ జోన్ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి, సూర్యాపేట‌, వికారాబాద్‌, వరంగల్ అర్బన్‌ జిల్లాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాల నుంచి రెడ్ జోన్ల నుంచి గానీ ఎలాంతి కొత్త కేసులు నమోదవడం లేదు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంది. దీంతో హైదరాబాద్ లో వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  కరోనా సోకిందేమోనన్న భయంతో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ భవనం మీద నుంచి కిందకు దూకేసిన 60 ఏళ్ల వృద్ధుడు 

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను మే 17 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ రోజుతో కేంద్రం విధించిన రెండో దశ లాక్డౌన్ ముగుస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ ఇదివరకే మే 7 వరకు లాక్డౌన్ పొడగించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఇచ్చిన సడలింపులపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ మంగళవారం తెలంగాణ మంత్రివర్గం మరోసారి భేటీ కానుంది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగింపుపై మరింత స్పష్టత రానుంది.