Cyberabad police (Photo-Video Grab)

Hyd, Feb 26: నకిలీ గుర్తింపులను ఉపయోగించి, రైతుబంధు & Rythu Bima డబ్బును రూ 2 కోట్లను అక్రమ మార్గంలోకి (Rythu Bandhu Scam) మళ్లించినందుకు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొందుర్గ్‌లోని అగ్రియల్ క్లస్టర్ ఏఈవో గోరేటి శ్రీశైలం (Agriculture Extension officer (AEO) Goreti Srisailam) రైతు బీమా రూ. 1కోటి, రైతు బంధు రూ. 1కోటి దారి (diverting Rs 2 crore of Rythu Bandhu & Rythu Bima money) మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

అధికారి శ్రీశైలం Rythu Bima కింద రూ. 1 కోటి వరకు ఎల్‌ఐసి మొత్తాన్ని 20 నకిలీ క్లెయిమ్‌ల ద్వారా దారి మళ్లించాడు. అతను 130 మంది నకిలీ పట్టాదార్ల రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం చేశాడు. రైతుబంధు స్కీమ్ యొక్క హక్కుదారులు కాని వారితో పాటు 2019 కాలం నుండి ఇప్పటి వరకు రూ. 1 కోటి రూపాయల వరకు నిధులను మళ్లించాడు.

తెలంగాణ గొర్రెల స్కాంలో నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్, చంచలగూడ జైలుకు తరలించిన అధికారులు, మార్చి 7 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

బీమా డబ్బుల కోసం బతికి ఉన్న 20 మంది రైతులు చనిపోయినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు. అలాగే చనిపోయిన రైతులు బతికే ఉన్నట్టు నివేదికలు సమర్పించి వారి పేరిట రైతుబంధు సొమ్మును ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. భార్య, స్నేహితులు, బంధువుల పేరిట దాదాపు 50 ఖాతాలు తెరిచి రూ. 2 కోట్ల గోల్ మాల్ కు పాల్పడ్డాడు.

Here's Police Statement

ఈ అక్రమ సంపాదనతో భూములు కొనుగోలు చేశాడు. తుమ్మలపల్లి వద్ద 8.5 ఎకరాలు, కొందుర్గు వద్ద 2.5 ఎకరాల జాగా కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసును సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు శ్రీశైలంతోపాటు అతడికి సహకరించిన ఓదెల వీరస్వామిని అరెస్టు చేశామని సైబరాబాద్ కమిషన్ అవినాశ్ మొహంతి తెలిపారు.

కొందుర్గు మండలం వెంకిర్యాల ,తంగళ్ళపల్లి, అగిర్యాల ,చిన్న ఎల్కిచేర్ల గ్రామాలకు ఏఈవో గోరేటి శ్రీశైలం ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన రైతులు చెందిన సుమారు 20 మంది రైతులు చనిపోయినట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వం తరఫున వచ్చిన రైతుబీమా సాయం రూ. కోటిని తన ఖాతాల్లో వేసుకున్నాడు. ఈ ఖాతాలు వేరే వారి పేరిట ఓపెన్ చేసి డెబిట్ కార్డులు మాత్రం తన వద్దే పెట్టుకున్నాడు. అఫీషియల్ మెస్సేజ్ వచ్చిన వెంటనే డబ్బులు డ్రా చేసేవాడు. ఎల్ఐసీ అధికారుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

కొందుర్గు మండలంలో రైతుబంధుకు దరఖాస్తు చేసుకోని, చనిపోయిన రైతులకు సంబంధించిన పాస్ బుక్ లు, ఆధార్ కార్డులను తీసుకొన్న శ్రీశైలం తనకు ప్రభుత్వం ఇచ్చిన లాగిన్ ఐడీని దుర్వినియోగం చేశారు. దాదాపు రెండు వేల మందికి సంబంధించిన రైతు బంధు సొమ్ము కాజేసినట్టు తెలుస్తోంది. వారి పేరిట రైతుబంధుకు దరఖాస్తు చేసి నాలుగేండ్లుగా యాసంగి, వానకాలం పంట పెట్టుబడి సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.