Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Hyderabad, May 03: తెలంగాణ, ఏపీకి మరో గండం పొంచి ఉంది. మరో ఐదు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే (Rain alert) అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 6 నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ దిశలో తుఫాన్‌ (Cyclone) ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాన్‌ 8 నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీని ప్రభావం ఒడిశా, ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. దీని కారణంగా హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడే అవకాశం ఉన్నదని అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌, యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం-రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ అంచనా వేశాయి.

AP Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు అలర్ట్, భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపిన వాతావరణ శాఖ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. 

తుఫాన్‌ ఏర్పడితే దానికి ‘మోచా’గా పేరు (Cyclone Mocha) పెట్టనున్నారు. మే 6వ తేదీని ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇక తుఫాను కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏపీ, ఒడిషా ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి.

Telangana Rains: బీ అలర్ట్, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తెలంగాణలో మరో మూడు రోజులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు 

తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ఒడిషాలో సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లఅఓ 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.