Newdelhi, Aug 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam Case) కేసులో అరెస్టయి.. గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ నిరాకరణకు గురైన కవితకు మంగళవారం బెయిల్ తప్పనిసరిగా వస్తుందనే ఆశలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ.
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత. pic.twitter.com/N3HzfYQQTs
— ChotaNews (@ChotaNewsTelugu) August 27, 2024
ఢిల్లీకి కేటీఆర్, హరీశ్
ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్‌పై మంగళవారం వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యు లు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.