Nizamabad Shocker: భార్యపై అనుమానం..గొడ్డలితో తల్లీ కూతుళ్లను నరికి హత్య చేసిన కసాయి భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: PTI)

Nizamabad, July 24: నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూర్‌లో దారుణ హత్యలు (Double Murder) చోటు చేసుకున్నాయి. ఓ కసాయి భర్త (Nizamabad Shocker) తనభార్యపై అనుమానం పెంచుకుని ఆమెను, ఆమెకు మద్ధతు ఇస్తుందని కూతురిని హత్య (man kils wife and Daughter) చేసాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోధన్‌ మండలం పెద్ద మావందికుర్దు గ్రామానికి చెందిన మల్లీశ్వరికి రుద్రూర్‌కు చెందిన బోజేడి గంగాధర్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి కూతురు రుత్విక ఉంది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గంగాధర్‌ ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో కూతురు రుత్విక తల్లికి మద్దతుగా మాట్లాడింది. దీంతో తల్లీకూతుళ్లపై గంగాధర్‌ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను గొడ్డలితో నరి కి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పోలీస్‌స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు.

నీ భార్యతో ఉంటే ఎమ్మెల్యే కాలేవు, జ్యోతిష్కుడు మాటలు నమ్మి భార్యను చిత్రహింసలకు గురి చేసిన ఓ భర్త, తట్టుకోలేక 8 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత భార్య, పూణేలో ఘటన

బోధన్‌ ఏసీపీ రామారావు, రుద్రూర్‌ సీఐ అశోక్‌ రెడ్డి, ఎస్సై రవీందర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్‌ ఏసీపీ తెలిపారు. వివాహేతర సంబంధ కారణంగా ఈ హత్యలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.