
నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల9Nalgonda Fake Journalists) గుట్టు రట్టైంది. కొంతకాలంగా పోలీసుల(Nalgonda Police)నే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఓ ముఠా. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తానని బెదిరింపులకు(Fake Journalists) పాల్పడుతోంది గ్యాంగ్. ఏకంగా ఓ సీఐ స్థాయి అధికారిని బెదిరించి రూ 5 లక్షలు డిమాండ్ చేసి రూ 1.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు.
గత నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది ముఠా. నకిలీ విలేఖరుల ఆగడాలు తట్టుకోలేక సీఐ తన మిత్రుడి ద్వారా రూ 1.10 లక్షలు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో
అయినా మరో రూ 4 లక్షలు ఇవ్వాలంటూ సీఐ కుటుంబానికి టార్చర్ పెట్టగా నకిలీ విలేఖరుల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధపడింది సీఐ కుటుంబం.
Fake Journalists Racket Exposed at Nalgonda
నల్గొండ : బిగ్ బ్రేకింగ్...
జిల్లాలో నకిలీ విలేఖరుల హల్చల్....
కొంతకాలంగా పోలీసులనే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్న ముఠా....
సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తానని బెదిరిస్తున్న గ్యాంగ్...
ఓ సీఐ స్థాయి అధికారిని బెదిరించి రూ 5 లక్షలు డిమాండ్,రూ 1.10 లక్షలకు…
— Telangana Awaaz (@telanganaawaaz) February 2, 2025
భాదిత పోలీసు అధికారి పిర్యాదు తో నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈ ముఠా పై గతంలో పలు కేసులున్నట్టు తెలుస్తోంది. వారి నేరచరిత్ర చిట్టా పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.