Hyderabad, Feb 2: హైదరాబాద్ (Hyderabad) లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు (Fire Accidents) నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఆదివారం నఃగారంలోని పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ కిందనున్న సెల్లార్ లో మంటలు చెలరేగి పై అంతస్తుల్లోకి క్రమంగా వ్యాపించాయి. అయితే, ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వాళ్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బిల్డింగ్ మొత్తం పొగ చూరిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video:
పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/8sUnpJODeA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2025
మొన్న తుక్కు గోదాంలో..
పాతబస్తీలో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో నెలరోజుల క్రితం ఇలాగే మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. రానున్న వేసవికాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.