Fire Accident at Jangaon (Credits: X)

Janagaon, Oct 27: జనగామలో (Janagaon) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ (Vijaya Shopping Mall) లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పెద్దయెత్తున  మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి పక్క షాపింగ్ మాల్స్ లోకి విస్తరించాయి. దీంతో వరసగా మూడు షాపింగ్ మాల్స్ దగ్ధమయ్యాయి. మరి కొన్ని షాపింగ్ మల్స్ కు కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నది. దీంతో భయాందోళనతో షాపుల్లోని సామగ్రిని పక్కా షాపు యజమానులు ఖాళీ చేస్తున్నారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల ప‌రిధి పెంపు, ధ‌ర‌ణి స్థానంలో భూమాత స‌హా అనేక అంశాల‌కు ప‌చ్చ‌జెండా

Here's Video:

అదుపులోకి రాని మంటలు

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇప్పటి వరకు 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంకా మంటలు అదుపులోకి రానట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకూ సుమారు రూ. 7 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్