First Level Biodiversity Flyover (Photo-KTR Twitter)

Hyderabad, May 21: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను (First Level Biodiversity Flyover) మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 27 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 1661కి చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, 40కి పెరిగిన కరోనా మరణాలు

690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల మూడు లేన్ల ఫైఓవర్‌ నిర్మాణానికి రూ. 30.26 కోట్లు వ్యయం అయినట్లుగా సమాచారం. ఈ ఫ్లైఓవర్‌ (First level flyover) పూర్తితో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల అంచనా వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి.

Here's KTR Tweet

ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు ఐదు పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్ పాస్, రాజీవ్ గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లెవెల్-2 ఫ్లైఓవర్లను గతంలోనే ప్రారంభించారు.

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు బుధవారం నుంచి అనుమతించారు. లాక్‌డౌన్‌తో మూసివేసిన ఓఆర్‌ ఆర్‌పై కేంద్ర మార్గదర్శకాలకు లోబడి వాహనాల రాకపోకలను అనుమతించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రాత్రి ఏడు  నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాష్ట్రంలో కర్వూ ఉన్నందున ఆ సమయంలో వాహనాలను అనుమతించబోమన్నారు. ఔటర్‌ టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఔటర్‌పై భారీ వాహనాలకు 24 గంటలపాటు రాకపోకలకు అనుమతించారు.