
Godavari Water Level Rising At Bhadrachalam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 320 అడుగులు ఉన్న నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 28.9 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో రానున్న 24 గంటల్లో మరింత ముంపునకు గురయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు చాలా వరకు నీట మునిగాయి.. అధికారులు అప్రమత్తమయ్యారు. జాలర్లు వేటకు వెళ్లవద్దని సూచించారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు స్నానాలు చేసే సమయంలో లోతుకు వెళ్లవద్దని నది వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు, స్కూల్స్ మూతపడే అవకాశం, పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
కోస్తా ప్రాంతంలోని ప్రభుత్వ అధికారులు లోతట్టు ప్రాంతాల వాసులకు వరద నీటి మట్టం వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని కలెక్టర్ డా.ప్రియాంక అలా ఆదేశించారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కలెక్టర్ తనిఖీలు చేస్తున్నారు