Hyderabad, Oct 21: తెలంగాణలోని (Telangana) నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్ (Group-1 Mains) పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలనే ఆందోళన నేపథ్యంలో... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
ప్రధాన నిబంధనలు ఇవీ...
- అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి.
- బొమ్మలు పెన్సిల్ లేదా పెన్నుతో వేయాలి. జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు.
- పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టికెట్ ను ఉపయోగించాలి. హాల్ టికెట్ పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం చేయాలి.
- జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.
- అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి.
- వేర్వేరు భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా గుర్తిస్తుంది.