Hyd, Nov 14: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు...మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదు..గుండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నారు.
ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతాం అని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారు..లగచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్నావు అన్నారు. కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేసినవు..ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేసిండు అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెబుతున్నరు...పోలీసులు ఒకే ఒక్క సారి ఫోన్ వచ్చిందని చెబుతున్నరు అన్నారు. ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు...రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడు అన్నారు.
అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు..రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు...పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు...గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు...చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటరు అన్నారు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత..మీరు అణిచివేస్తున్న విద్యార్థులు, పోలీసులు, రైతులు, గిరిజనులకు మద్దతు ఇవ్వడం మా బాధ్యత అన్నారు.వారి హక్కుల కోసం పోరాటం చేయడం మా బాధ్యత...నువ్వు చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా అన్నారు.
పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత..మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు అన్నారు. నన్నో, కేటీఆర్ నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు...మా భూమి మాకు కావాలి అని పోరాటం చేస్తే వేధిస్తరా చెప్పాలన్నారు. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదు...ఇదేం ప్రజాస్వామ్యం. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం ఇస్తున్న అని చెప్పినవు అన్నారు.ఆరోజు మల్లన్న సాగర్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు....నీకు రక్షణ ఇచ్చినం కదా, నిన్ను అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు..మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మా మధుసూదనాచారి గారు లగచర్లకు వెళ్తే అడ్డుకున్నవు అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డి లను అడ్డుకున్నవు...ఎంపీ అరుణ వెళ్లకుండా అడ్డుకున్నవు..తొమ్మిది నెలల గర్బిణీ మీద చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు అన్నారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన?,అక్రమంగా అరెస్టు చేసి నరేందర్ రెడ్డి, కేటీఆర్ మీద కేసులు పెడుతవు కావొచ్చు...నిన్ను గద్దె దించడం మాత్రం ప్రజలు మరిచిపోరు అన్నారు. హైదరాబాద్ లో 14వేల ఎకరాల్లో భూమి తయారు చేసిండు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం...ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తడట. పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నడు...ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?,ఫార్మా సిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టు...కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకో అన్నారు. నీ ప్రాధాన్యం అదానీ, నీ ప్రాధాన్యం నీ అల్లుల్లు...దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నవు,నువ్వు, కోదండరాం, దామోదర్ రాజనర్సింహ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆనాడు మీమీద కేసులు పెట్టలేదు అన్నారు.
ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద కేసులు పెడతరా...రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో తెలియదు అన్నారు నరేందర్ రెడ్డి..కేటీఆర్ ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పారన్నారు. చదివే అవకాశం లేకుండా తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారు...నాకే సంబందం లేదు, కేటీఆర్ ను ఎందుకు ఇరికించారు అని చెప్పిండన్నారు. రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు, మేజిస్ట్రేట్ ముందుకు కూడా ఇదే చెప్పాను..నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.
ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి..బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు అన్నారు. బడా బడా బాబులకు భూములు కట్టబెడుతరా...ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నరు, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని...మాకు న్యాయం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది...నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయం అని చెప్పారు.