Harishrao sensational comments on cm Revanth Reddy at Chit Chat with Media(BRS X)

Hyd, Oct 30:  కేసీఆర్ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్‌ రావు...రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు...దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు...తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చిట్ చాట్ లో మాట్లాడి కుర్చీకి ఉన్న గౌరవం తగ్గించారు అని మండిపడ్డారు హరీశ్ రావు. హైదరాబాద్ కి మూడు వైపులా సముద్రం ఉంది అన్నారు...గోవా పోవడం ఎందుకు హైదరాబాద్ లో ఉన్నవని అని..జోకులు వేస్తున్నారు అన్నారు. రేవంత్ సీఎం కాదు జోకర్ అన్నారు.కొడంగల్ లో ఓడి పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు..తీసుకోకుండా ఎంపీ కి పోటీ చేశారు అన్నారు.

కేసీఆర్ పవర్ ఫుల్ ఫైటర్ ,లీడర్..రేవంత్ చిల్లర మాటలు అపు అన్నారు. నీ పక్కన ఉన్న వాళ్ళు కుర్చీ లాక్కుంటారు..నీ కుర్చీ ని ఎప్పుడూ ఎవరు గుంజుకుంటారో తెలియదు అన్నారు. రేవంత్ 5 ఏండ్లు ఉండాలని కోరుకుంటున్నాం...ఒక మంత్రి గవర్నర్ ని కలిశారు..ఇంకో మంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగ బద్ధమైన పదవీలో ఉండి మాట్లాడితే అలా మాట్లాడితే గ్రూప్ 1 రాసే వాళ్ళు పిల్లలు ఏమి అయ్యి పోవాలి....మల్లన్న సాగర్ బదితులకు ఒక్క ఇల్లు కట్టలేదని తప్పుగా మాట్లాడారు..మల్లన్న సాగర్ కి 50 వేల ఏకరాలు కాదు 17 వెల ఎకరాలు..14 ప్రభుత్వ పట్టా అసైన్డ్ భూమి 3 వేల ఎకరాలు ఫారెస్ట్ భూమి అన్నారు.

రేవంత్ రెడ్డి మాటలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి అన్నారు.కేసీఆర్ కు, రేవంత్ కు నక్కకూ.. నాగలోకాని ఉన్న తేడా ఉంది అని...సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి అన్నాడు. ర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నాడు...ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్. సీఎం అయ్యేది కేసీఆర్ అని తేల్చిచెప్పారు.  బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య డ్రగ్స్ టెస్ట్ యుద్ధం, డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు...బీఆర్ఎస్ నేతలకు సవాల్

దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది...కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? చెప్పాలన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశాడని..ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు అన్నారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేడు అని ఎద్దేవా చేశారు.రకరకాల సాకుతో రుణమాఫీ చేయకుండా సాకు చూపుతున్నారు..ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ లేదు అన్నారు హరీశ్‌ రావు. విద్యా మైనార్టీ పోలీస్ శాఖ లకు మంత్రులు డిప్యూటీ స్పీకర్ చీప్ విప్ లేరు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్ రావు...కేసీఆర్ భిక్ష తో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు..కేసీఆర్ కి రేవంత్ కి నక్కకి నాగలోకనికి ఉన్న తేడా ఉందన్నారు.మూడు సార్లు రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడి పోయింది అంటే రాహుల్ పని అయిపోయింది అన్నట్లు ఉందన్నారు.