Heavy rainfall warning in Telangana for next 3 days (Photo-PTI)

Hyd, Sep 26: తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని (Heavy rain forecast) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30 వరకు ( Nex Four days) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ (IMD issues yellow alert) జారీ చేసింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సగటు సముద్రం మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

కింది స్థాయిలోని గాలులు వీస్తున్నాయని, ముఖ్యంగా ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ హైదరాబాద్‌తో సహా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.

హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్ల మీదకు..

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్‌, నాంపల్లి, ట్యాంక్‌బండ్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పురా, అత్తాపూర్‌ జాగీర్‌, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రామ్‌నగర్, దోమలగూడ, పాతబస్తీ చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.