Heavy Rains in Hyd: భారీ వర్షాలకు వణికిన హైదరాబాద్, సైదాబాద్‌ కృష్ణానగర్‌ వరద నీటిలో గుర్తు తెలియని మృతదేహం, అస్తవ్యస్తమైన జనజీవనం, నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
Heavy rains in Hyderabad stall life (Photo-Twitter

Hyderabad, Sep 21: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological dept) ప్రకటించింది. దీంతోపాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం (Heavy rains predicted) ఉందని వెల్లడించింది. కాగా, తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి, దక్షిణ కర్ణాటక, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు ప్రకటించింది. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు వాతావరణ శాఖ సూచించింది.

హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం భారీ వర్షం (Heavy rains in Hyd) దంచికొట్టింది. దీంతో జనజీవనం స్తంభించి పోయింది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. బహదూర్‌పురా నాలా పొంగి పొర్లడంతో రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరింది. దీంతో పాదచారులు, వాహనదారులను స్థానిక యువకులు తాడు సాయంతో రోడ్డు దాటించారు. చార్మినార్‌ వద్ద రహదారులపై వరద ముంచెత్తడంతో గంటలకొద్దీ రాకపోకలు నిలిచిపోయాయి.

చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది, మీ రాహుల్ గాంధీ రెడీనా.. సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్, ముందు సీఎం కేసీఆర్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి

బండ్లగూడ, ఆసి‌ఫ్ నగర్‌, లంగర్‌హౌస్ లోని రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సైదాబాద్‌ కృష్ణానగర్‌ వరద నీటిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. అలాగే సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, చిక్కడపల్లి, రామంతాపూర్‌, రాంనగర్‌, కవాడిగూడ, ఇందిరాపార్కు, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, విద్యానగర్‌, అడిక్‌మెట్‌, తదితర ప్రాంతాల్లోని రహదారులపై మోకాలి లోతు నీటితో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. జూపార్కు వద్ద 9.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిను ము, పెసర పంటలు నీట మునిగాయి.

Here's Rains Visuals

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో అత్యధికంగా 11.9 సెం.మీ. వర్షపాతం కురిసింది. వికారాబాద్‌ జిల్లా బొంరా్‌సపేటలో పిడుగుపాటుకు తహసీల్దార్‌ కార్యాలయం, పోలీసు స్టేషన్‌లోని వైర్‌లెస్‌ సెట్‌లు కాలిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు, వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాటి వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, బందోబస్తు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం శేరిగూడెంలో భారీ వర్షానికి విద్యుత్‌ తీగలు తెగి పడి రెండు ఎద్దులు మృతి చెందాయి. మంచిర్యాలలో పిడుగుపడి బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకు దుర్మరణం పాలయ్యారు. నెన్నెలలో ఎర్రవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.