Hyd, July 29: హైదరాబాద్ మహానగరాన్ని వర్షం (Rain) వీడడం లేదు. నేడు మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ (LB Nagar), దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది.
అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కనిపించింది. ఆ తర్వాత 4 గంటల నుంచి భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉద్యోగులు ఇంటికి వెళ్తున సమయంలో వర్షం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లుగా వార్తలు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, షేక్‌పేట, టోలీచౌకి, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీగా వానలు కురిసాయి. ఇక సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఏకధాటిగా గంటసేపు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఒక తెలంగాణను వర్షాలు (Rains) ముంచెతుతున్నాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీనది (Musi river) పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని ఆనుకుని ఉన్న కాలనీల లోని ఇళ్లలోని నీరు ప్రవేశించాయి. ఇక మరో 4 గంటల పాటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.