Nagarjuna to send legal notices to Konda Surekha(X)

Hyderabad, OCT 03: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు నాంప‌ల్లి కోర్టులో Nampally Court) నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌మ కుటుంబ గౌర‌వాన్ని, ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశారంటూ నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. కొండా సురేఖ‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్‌లో నాగార్జున (Akkineni Nagarjuna) కోరారు. శుక్ర‌వారం నాగార్జున పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపే అవకాశం ఉంది. ‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. అబద్ధం’ అని సినీ నటుడు అక్కినేని నాగార్జున నిన్న ఎక్స్ వేదిక‌గా స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి.. సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి’ అని సూచించారు.

Konda Surekha vs KTR: కేసీఆర్‌ని చంపి పూడ్చి పెట్టాడేమోనని కేటీఆర్ మీద  డౌట్‌గా ఉంది, మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో.. 

సురేఖ వ్యాఖ్యలను బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మంత్రి కొండా సురేఖ (Konda urekha Cmments) వాఖ్యలు తమ కుటుంబం పట్ల, చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని తేల్చిచెప్పారు. తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Mahesh Babu on Konda Surekha Comments: కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో మహేశ్ బాబు 

తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సినీనటుడు అక్కినేని నాగార్జున సతీమణి, నటి అకినేని అమల ఫిర్యాదుచేశారు. తన కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలను వెనకి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్‌గాంధీ చొరవ తీసుకోవాలి’ అని అమల డిమాండ్‌ చేశారు.