Hyderabad, Dec 31: ఫార్ములా-ఈ కారు రేసుకు (Formula E-Car Race Case) సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా-ఈ రేస్ విషయంలో నిధుల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
హైదరాబాద్:
నేడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ..
కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించనున్న తెలంగాణ హైకోర్టు..
రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్..
అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలన్న ఏసీబీ..
నేటితో ముగియనున్న…
— Telangana Awaaz (@telanganaawaaz) December 31, 2024
ఏ తీర్పు వస్తుందో??
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇప్పటికే ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ, తుది తీర్పు నేడు వెల్లడించనున్నది. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే, కేటీఆర్ రాజకీయ జీవితానికి కీలకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే