Patancheru Road Accident: పఠాన్‌ చెరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుమంది అక్కడికక్కడే మృతి, నలుగురికి గాయాలు, మృతులను జార్ఖండ్‌కు చెందిన కార్పోరేటర్లగా గుర్తింపు
Road accident (image use for representational)

Patancheru, Nov 10: తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Patancheru Road Accident) చోటు చేసుకుంది.సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌ చెరు మండలం పాటి ఓఆర్‌ఆర్‌ రింగ్‌ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి (Six migrant workers killed) చెందారు. మరో నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నట్లుగా వార్తలు అందుతున్నాయి.

వీరందిరినీ జార్ఖండ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. మృతుల్లో రాంఘడ్‌కు చెందిన కమలేష్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్, పవన్ కుమార్ (ఘోరఖ్‌పూర్‌), బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీ కాలేజి యాజమాన్యం వేధింపులు, షాద్‌నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థిని, బీజేపీ విధించిన లాక్‌డౌన్‌ ఐశ్వర్య చావుకు కారణమని మండిపడిన రాహుల్ గాంధీ

ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. బాధితులంతా గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌కు వెళ్తుండగా రింగ్‌ రోడ్డుపై ప్రమాదం జరిగిననట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.