Bonalu Celebrations: లాల్‌ దర్వాజా మహంకాళి బోనాలు, పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ, ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారో..పూర్తి వివరాలు ఓ సారి చూద్దామా..
CP Anjani kumar (Photo-Twitter)

Hyderabad, July 31: ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు (Hyderabad Bonaly Festival) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోనాల‌కు త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం, దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామ‌న్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామ‌ని పేర్కొన్నారు.

బోనాలు స‌మ‌ర్పించేందుకు వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని కోరారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

పాతబస్తీలో లాల్‌ దర్వాజ బోనాల ( Old City Bonalu celebrations) సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు ఉంది. దీంతో సోమవారం బోనాల జాతరకు సంబంధించిన ర్యాలీ పాతబస్తీలో కొనసాగనుంది.ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నన్ను చంపినా సరే అబద్దాలు చెప్పి మోసం చేయను, కేసీఆర్‌ చెప్పాడంటే జరిగి తీరాల్సిందే, దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ ఉత్తర్వులు చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, బహదూర్‌పుర ప్రాంతాల్లో అమలులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్‌, ఫలక్‌నుమా, నయాపూల్‌ వైపు అనుమతించరు, సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా ఎక్స్‌ రోడ్‌, ఇంజన్‌బౌలి రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

రేపటి కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఉమ్మడి ఆలయాల బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం కార్వాన్ ఏకే ఫంక్షన్ హాల్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు. బోనాల ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఉత్సవాల కోసం 300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ బోనాల ఉత్సవాల్లో బోనాలు ఎత్తుకుని వచ్చే మహిళలకు కూడా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

అపోలో ఆస్పత్రిలో ఈటల రాజేందర్, ఆక్సిజన్‌, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపిన వైద్యులు, ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్‌

కాగా ఆదివారం సాయంత్రం సబ్జీ మండిలోని మహంకాళి దేవాలయం నుంచి ఘటాలను అంబారి (ఏనుగు) పై భారీ ఊరేగింపుగా జీరా ఆ ప్రాంతంలోని పోచమ్మ దేవాలయం ప్రాంతానికి తరలి వెళ్తారని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఈ ఊరేగింపులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయని, అర్ధరాత్రి వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయని అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

అలాగే సోమవారం ఉదయం రంగం, బలి గంప, పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయన్నారు. సాయింత్రం భారీ తొట్టెలను నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు, ఆలయాల నిర్వాహకులు వస్తారని డీసీపీ తెలిపారు. ఈ ఊరేగింపు గణేష్ ఘాట్ మూసీ నది వరకు కొనసాగుతుందన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీసీపీ శ్రీనివాస్ కోరారు.

అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయం వద్ద జరిగే బోనాల సందర్భంగా అంబర్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా వరంగల్‌, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే అంబర్‌పేట్‌ వైపు వచ్చే జిల్లా బస్సులను దారి మళ్లిస్తారు. వరంగల్‌, తదితర ప్రాంతాల వైపు నుంచి ఉప్పల్‌మీదుగా అంబర్‌పేట్‌ వైపునకు వచ్చే వాహనాలు, తార్నాక, అడిక్‌మెట్‌, విద్యానగర్‌, ఫీవర్‌ ఆసుపత్రి, టూరిస్ట్‌ హోటల్‌, నింబోలి అడ్డ, చాదర్‌ఘాట్‌, సీబీఎస్‌ వైపు మళ్లిస్తారు. తిరిగి వెళ్లే వాహనాలు కూడా అదే రూట్‌లో వెళ్లాలి.

ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపు వివరాల సమాచారం.

రాజన్న బౌలీ నుంచి లాల్‌ దర్వాజ ఆలయం వెళ్లే వాహనాలను పతీర్‌ కి దర్గా లాన్‌ నుంచి రామస్వామి గంజ్‌ వైపు మళ్లిస్తారు.

కందికల్‌ గేట్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్‌ ఛత్రినాక పీఎస్‌ ‘వై’ జంక్షన్‌ నుంచి గౌలిపుర వైపు మళ్లిస్తారు.

బాలాగంజ్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌ వాహనాలను లక్ష్మీదేవీ పాన్‌ షాప్‌ నుంచి నాగులచింత జంక్షన్‌ వైపు మళ్లిస్తున్నారు.

ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి వచ్చే వాహనాలను షుకూర్‌ మాస్క్‌ వైపు అనుమతించరు, ఈ వాహనాలను మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్‌ వైపు మళ్లిస్తారు.

మీర్‌ కా డేరా, మొగల్‌పుర వైపు నుంచి వెళ్లే వాహనాలను హరిబౌలి క్రాస్‌రోడ్స్‌ వైపు అనుమతించరు, ఈ వాహనాలను వాటర్‌ ట్యాంకు వైపు మళ్లిస్తున్నారు.

అస్ర దవాఖాన, మొఘల్‌పుర వాటర్‌ ట్యాంకు వైపు నుంచి చార్మినార్‌ మెయిన్‌ రోడ్డు వైపు ట్రాఫిక్‌ అనుమతించరు, ఈ రూట్‌లోని వాహనాలను బీబీ బజార్‌ వైపు మళ్లిస్తారు.

భవానీనగర్‌, మిర్జాలం తాలబ్‌ వైపు నుంచి చార్మినార్‌ వెళ్లే వాహనాలను అనుమతించరు, ఈ వాహనాలను బీబీ బజార్‌ క్రాస్‌ రోడ్డు వద్ద అలీజా కోట్ల వైపు(మిరాలం మండి రోడ్డు) దారి మళ్లిస్తారు.

యాకత్‌పుర నుంచి గుల్జార్‌హౌస్‌కు వెళ్లే వాహనాలను మీరాలంమండి రోడ్డులోకి ఇతేబార్‌ చౌక్‌ నుంచి మిరాలం మండి, అల్జాకోట్ల వైపు వైపు దారి మళ్లిస్తున్నారు.

పురానాహవేలి, మండి రోడ్‌ నుంచి చెత్త బజార్‌కు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్‌ కోటీ చౌరస్తా వద్ద దారుల్‌ షిఫా వైపు మళ్లిస్తున్నారు.

చాదర్‌ఘాట్‌, నూర్‌ఖాన్‌ బజార్‌, దారుల్‌ షిఫా నుంచి నయాపూల్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు, ఈ వాహనాలను ఎస్‌జే రోటరీ నుంచి పురానా హవేలి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్‌ వైపు మళ్లిస్తారు.

ఫతే దర్వాజ నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పుర ఎక్స్‌ రోడ్డువైపు అనుమతించరు, హోల్గ హోటల్‌ వద్ద ఖిల్వత్‌ వైపు మళ్లిస్తున్నారు.

ఖిల్వత్‌ నుంచి లాడ్‌ బజార్‌ వెళ్లే వాహనాలు మోతీగల్లి టీ జంక్షన్‌ వద్ద చౌక్‌ మాస్క్‌ వైపు దారి మళ్లిస్తారు.

బండి కీ అడ్డా, ఝాన్సీబజార్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌వైపు అనుమతించరు, మిట్టీ కె షేర్‌ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

పురానాపూల్‌, గుడ్‌ విల్‌ హోటల్‌, మూసాబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను నయాపూల్‌ వైపు అనుమతించరు, ముస్లీంజంగ్‌ బ్రిడ్జి వద్ద మళ్లిస్తున్నారు.

గౌలిగూడ, సిద్దిఅంబర్‌ నుంచి నయాపూల్‌ వైపు వచ్చే వాహనాలను అఫ్జల్‌గంజ్‌ చౌరస్తా నుంచి ముస్లీంజంగ్‌ బ్రిడ్జ్‌ ఉస్మానియా దవాఖాన రోడ్డు వైపు మళ్లిస్తున్నారు.

మదీన ఎక్స్‌ రోడ్స్‌, ఇంజన్‌బౌలి, జహనుమా రోడ్లు మూసివేస్తారు. ఎలాంటి వాహనాలను అనుమతించరు.

పార్కింగ్‌ స్థలాలు..

అలియాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్‌కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్‌ లైన్‌, అల్కా థియేటర్‌ బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి.

హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్‌, సుధా థియేటర్‌ లేన్‌, అల్క థియేటర్‌ ఓపెన్‌ ప్లేస్‌.

ఛత్రినాక ఓల్డ్‌ పీఎస్‌ వైపునుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్‌, సరస్వతి విద్యానికేతన్‌, – ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ఫలక్‌నుమా, పత్తర్‌ కి దర్గా సమీపంలో పార్కు చేయాలి.

మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్‌ బస్‌ టర్మినల్‌లో పార్కు చేయాలి.

అంబర్‌పేట్‌లోనూ వాహనాల దారి మళ్లింపు..