Hyderabad, July 10: మానసిక స్థితి సరిగా లేని ఓ వైద్య విద్యార్థి (Medical Student) బ్లేడ్ తో (Blade) పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డినగర్‌కు చెందిన దీక్షిత్‌రెడ్డి (21) సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గత కొంతకాలంగా మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్మాంగం కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానించి కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా..
గతంలో ఒకసారి నిద్రమాత్రలు మింగి దీక్షిత్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించడని కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో స్పందించడంతో తమ బిడ్డను కాపాడుకోగలిగామని కన్నీరుమున్నీరయ్యారు.