Murder Representative Photo (Photo Credit: Pixabay)

Hyd, April 21: హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ పరిధిలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే అమావాస్య రోజున బాలుడిని ఓ హిజ్రా నరబలి ఇచ్చిన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడు (8)ను స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్‌ వద్ద వసీంఖాన్‌ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును ఫిజాఖాన్‌ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గురువారం వాగ్వాదం జరిగింది.

ప్రియురాలి మేనమామను కత్తితో నరికిన ప్రియుడు, మేనకోడలిని ఇంటికి తీసుకువెళతానని చెప్పడంతో ముదిరిన గొడవ

ఈ క్రమంలో నిన్న సాయంత్రం వసీంఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించారు. ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని ఫిజాఖాన్‌ ఇంటి వైపునకు వెళ్లారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతో స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు.

చిత్తూరులో దారుణం, కానిస్టేబుల్ కూతురు గొంతు కోసిన యువకుడు, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి అక్కడికక్కడే మృతి

బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించడంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు తెలిసింది.

బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో అల్లాదున్‌ కోటి బస్తీలో ఉద్రిక్తత నెలకొంది.