Hyd, May 25: భాగ్యనగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎస్‌ఓటీ పోలీసులు (Hyderabad Police ) దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని పిల్లర్ నంబర్ 1725 వద్ద విసన్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పాలో వ్యభిచారం (Sex racket in Madhapur ) నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో దాడి చేశారు.
దీంతో నిర్వాహకులు సరూర్‌నగర్‌కి చెందిన రాసుల మంగ(36), సహా నిర్వాహకులు కూకట్‌పల్లికి చెందిన కొండురు పాక సురేష్, విక్కీ, కస్టమర్ లింగంపల్లికి చెందిన కాకి సునంద్ (22), ముంబై, వెస్ట్‌బెంగాల్‌కి చెందిన విక్టిమ్ మిన్న హర్‌కతున్(22)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2వేలు నగదు, బ్లాక్ కలర్‌టీవీ, ఒప్పో గోల్డ్ కలర్ సెల్‌ఫోన్, వీవో బ్లూ కలర్ మొబైల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇక మరొక ఘటనలో.. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఎన్ కన్వెన్‌షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ హోటల్ 4వ ఫ్లోర్ గది నంబర్ 401లో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడిచేశారు. ఈ సంఘటనలో పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలో రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్‌పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు