Hyd, August 29: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్
రెండు సెంటర్లలో మొత్తం 17 మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. అమాయక యువతులే టార్గెట్ గా డబ్బు ఆశ చూపి ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మసాజ్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారని చెప్పారు. ఆపై వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారని వివరించారు. దీనిపై పక్కా సమాచారంతో మంగళవారం దాడులు నిర్వహించగా.. రెండు సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.