Image used for representational purpose (Photo Credits: Pixabay)

Hyderabad, Mar 13: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ ను అయిదుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి హత్య (Old City Shocker) చేశారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన (Rowdy sheeter Assassinated In Old City) జరిగింది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ తెలిపిన మేరకు.. మైలార్‌దేవ్‌పల్లి ముస్తఫానగర్‌కు చెందిన అశ్రఫ్‌ కుమారుడు మహ్మద్‌ జాబేర్‌ (26) డెకరేషన్‌ పని చేస్తుంటాడు. ఇతను నేరాలకు పాల్పడుతుండడంతో ఇతనిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు.

కాగా గతేడాది కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రౌడీషీటర్‌ షానూర్‌ ఖాజీ హత్య కేసులో ఇతడు ఏ–5గా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సిగరెట్‌ తాగేందుకు సిటీ ప్లాజా ఫంక్షన్‌హాల్‌ వద్దకు వచ్చాడు. ఈ సమయంలో అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో దాడి చేస్తారని గ్రహించిన జాబేర్‌ అక్కడినుంచి పరిగెత్తాడు. అయినప్పటికీ వదలకుండా నిందితులు అతన్ని అర కిలోమీటర్‌ మేర వెంటాడి కత్తులు, కోడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

జీవితం మీద విరక్తితో వ్యక్తి ఆత్మహత్య, మరోచోట ఒంటిపై పెట్రోల్ పోసుకుని భార్యను కౌగిలించుకున్నాడు, మంటల్లో ఇద్దరూ సజీవదహనం, అనాధగా మారిన కొడుకు

సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్, ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన స్థలం సరిహద్దులో ఉండడంతో ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చాలా సేపటి వరకు ఎవరి పరిధిలోనిది అనేది తేల్చుకోలేకపోయారు. చివరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షానూర్‌ ఖాజీ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.