Hyderabad Shocker: భర్తకు పీకల దాకా మద్యం తాగించి భార్యపై రేప్, అనంతరం హత్య, హ‌య‌త్‌న‌గ‌ర్‌ పరిధిలో దారుణ ఘటన, మీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హిజ్రా
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyd, Nov 23: భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు (Hyderabad Shocker) చేసుకుంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌కు స‌మీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం తారామ‌తిపేట్‌లో ఓ వివాహితపై ఇద్దరు గ్రామస్థులు అత్యాచారం చేసి ( Two Men Murder woman after rape) తర్వాత హతమార్చారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారామ‌తిపేట్‌కు చెందిన ఓ వ్య‌క్తికి మంగ‌ళ‌వారం రాత్రి ఇద్ద‌రు దుండ‌గులు పీక‌ల దాకా మ‌ద్యం తాగించారు.

మ‌ద్యం అతిగా సేవించ‌డంతో అత‌ను స్పృహ కోల్పోయాడు. అనంత‌రం అత‌ని భార్య‌పై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారం చేసి మ‌ట్టుబెట్టారు. సురేశ్‌, శ్రీకాంత్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ ప‌రారీలో ఉన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరీ...పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుమందు తాగిన యువకుడు, మేము వేధించలేదని అతనే యువతి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపిన పోలీసులు

ఇక నగరంలో పహడీషరీప్ లో లక్ష్మీనర్సింహ్మ అలియాస్ లక్కీ(04)ని దారుణంగా హత్య చేసిన నిందితుడిని పహాడీషరీఫ్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న వీరేశ్‌ ఆచారి (29) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు ఏండ్ల‌ క్రితం భార్య లక్ష్మీతో విభేదాల కారణంగా విడిపోయారు.

భార్య లక్ష్మీ శ్రీరామకాలనీలోనే తల్లి ఇంటి వద్ద ఉంటుంది. తన భార్యను తన వద్దకు రాకుండా వదిన మహేశ్వరి అడ్డుపడుతుందని కోపంతో ఆమె మూడేండ్ల కుమారుడుని ఇందిర సొసైటీ వద్ద పాడుబడ్డ గదిలో ప్లాస్టిక్‌ వైర్‌తో మెడకు ఉరివేసి, తలను నేలకోసి కొట్టి దారుణంగా హతమార్చాడు. 20న మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

శ్రీధర్ రావు రెండు గంటల పాటు నన్ను దారుణంగా రేప్ చేశాడు, సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ట్రైనర్, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు

ఇక ఉరేసుకుని ఓ హిజ్రా మృతి చెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని నందనవనంలో నివాసముంటున్న స్వప్న (24) అనే హిజ్రా మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన నిశాంత్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నందనవనంలోనే వారు సహజీవనం చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం త‌న ఊరికి వెళ్లిన నిశాంత్ తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన స్వప్న సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.