Youngster attempts suicide (Photo-Video Grab/Facebook)

Sircilla, Nov 23: తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు (Youngster attempts suicide) పాల్పడుతున్నానంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో (streams live on Facebook) పురుగుల మందు తాగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు గొలిసెల దిలీప్‌ (23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తనను సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ వేధిస్తున్నాడని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడని, మళ్లీ తనపై మరో కేసు (alleged harassment by the police) నమోదు చేశాడని లైవ్‌లో ఆరోపించాడు.

వేములవాడ శివారులోని చింతలఠాణాకు చెందిన యువతిని ప్రేమించానని, సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలను పోలీసులు తొలగించారని, ఆమెను వదిలివేయాలని, మరచిపోవాలని వేధిస్తున్నారని ఈ వీడియోలో పేర్కొన్నాడు. నాపై రౌడీషీట్‌ తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పాడు. సదరు యువతిని వేధిస్తున్నానంటూ గతంలో కూడా ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

శ్రీధర్ రావు రెండు గంటల పాటు నన్ను దారుణంగా రేప్ చేశాడు, సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ట్రైనర్, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు

ఆదివారం మరో కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరించారని, దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫేస్‌బుక్‌ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. బస్వాపూర్‌–నేరెళ్ల గ్రామాల మధ్య దిలీప్‌ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న దిలీప్‌ను సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

దీనిపై సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్ మాట్లాడుతూ..యువతి ఫొటోలు తీసి దిలీప్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడని తెలిపారు. ఈ విషయంలో గతంలో పోలీసు కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చా డు. అయినా మళ్లీ అతడి వేధింపులు తగ్గకపోవడంతో షీ–టీమ్‌ను ఆశ్రయించారు. షీ–టీమ్‌ సూచనలతో అతడిపై మరో కేసు నమోదు చేశామని తెలిపారు. యువతిని వేధిస్తున్న అంశంలో చట్టబద్ధంగానే వ్యవహరించామని మేము అతన్ని మేం వేధించలేదని తెలిపారు.