Representative image. (Photo Credits: Unsplash)

Hyd, April 13: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ (Banjarahills) షేక్‌పేట పారామౌంట్‌ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును కడుగుతుండగా విద్యుదాఘాతంతో (Short circuit) ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు.బంజారాహిల్స్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనస్‌ (19) తమ ఇంట్లో ఉన్న మోటారు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు యత్నించగా కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు.

హైదరాబాద్‌లో దారుణం, మహిళపై అత్యాచారం చేసి ఆపై నిప్పంటించి చంపేశారు, ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు

వెంటనే సమీపంలో ఉన్న రిజ్వాన్‌ (18) తన అన్నను కాపాడేందుకు యత్నించగా అతడికి కూడా షాక్ తగిలింది. అన్నదమ్ములను రక్షించేందుకు పక్కనే ఉన్న స్నేహితుడు రజాక్‌ (16) ప్రయత్నించగా ప్రమాదవశాత్తు అతడు కూడా షాక్‌కి గురయ్యాడు. ముగ్గురూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రంజాన్ మాసంలో తమ కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.