Credits: Twitter

Hyderabad, Dec 6: మద్యం తాగి వాహనం (Drunk and Drive) నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సదరు వాహనదారుడి లైసెన్స్‌ (Driving License Revoke) కూడా రద్దు కానున్నది. అంతేకాదు అధిక వేగం, బరువుతో గూడ్స్‌ వెహికల్స్‌ నడిపినా లైసెన్స్‌ రద్దు అవుతుంది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ లు చేపట్టనున్నారు. ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుపడితే లైసెన్సును సస్పెండ్‌ చేసేందుకు పోలీసులు రవాణాశాఖకు సిఫార్సు చేయనున్నారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)

ఏడాదిలో ఎన్ని లైసెన్సులు రద్దు అంటే?

ఈ ఏడాదిలో తెలంగాణలో 15,209 లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్‌ చేసింది. ఇందులో ఎక్కువగా డ్రంక్‌ అండ్‌ డైవ్‌ కేసులే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్