Credits: Twitter

Hyderabad, April 28: తెలంగాణలో (Telangana) రాబోయే రెండు రోజుల్లో వర్షాలు (Rains) పడనున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు (Northern Districts), తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Telangana Rains: భారీ వర్షాలు, ఈ ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ద్రోణి కారణంగా నేడు.. మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీ ప్రజలకు చల్లని కబురు, మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని తెలిపిన వాతావరణ శాఖ