Heatwave (Photo Credits: PTI)

ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణ­శాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాం­తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగా­డ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. అయితే పరిస్థితిలో మార్పు వచ్చింది.వడ­గా­డ్పులు తగ్గు­ముఖం పట్టాయి.

అల్ప­పీడన ద్రోణి, విండ్‌ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొద­లయ్యాయి. ఉరు­ములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తు­న్నా­యి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతు­న్నాయి. ప్రస్తుతం పలు­­చోట్ల సాధా­రణంగాను, కొన్నిచోట్ల సాధార­ణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువ­గాను నమోదవుతున్నాయి.

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక, మరో మూడు రోజుల పాటు గాలివానలు, ఎవరూ బయటకు రావొద్దని ఐఎండీ ఆదేశాలు

ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వ­ర­కు ఒకిం­త ప్రభా­వం చూపుతున్నా ఆ తర్వాత తగ్గు­ముఖం పడుతూ ఊరట­నిస్తున్నాయి. ప్రస్తుతం పలు­­చోట్ల సాధా­రణంగాను, కొన్నిచోట్ల సాధార­ణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువ­గాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు.

ప్రస్తు­తం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉప­రితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురు­గాలు­లతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్ర­తలు మునుపటికంటే తక్కువగా నమోదవుతు­న్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొన­సా­గు­తా­యని, అందువల్ల అప్పటివరకు వడగా­డ్పులు వీచే అవకాశాల్లేవని భార­త వాతావరణ విభా­గం మంగళవారం తెలిపింది.