Telangana Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్, రెండు రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు వడగండ్ల వాన అలర్ట్
Representational Picture

Hyd, Mar 19: తెలంగాణలో అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే, మరో రెండు రోజులు కూడా తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక రెండు రోజుల నుంచి కురిసిన అకాల వర్షం రైతన్నలకు తీరని నష్టం కలిగించింది.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది.

ఏపీలో మరో 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం, వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని ఆదేశాలు

అలాగే, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.