Weather Forecast: ఉత్తర తెలంగాణకు అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షం
Credits: Twitter

తెలంగాణలోని రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు.. హైదరాబాద్ నగరవాసులకు వాతావారణ శాఖ హెచ్చరికలు.. వచ్చే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌(Hyderabad)తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్‌(Adilabad), కొమ్రుం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్(Nirmal)‌, నిజామాబాద్‌(Nizamabad), జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.