Peddapalli Car Accident: పెద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరి వ్యాపారులు మృతి, మరో ఇద్దరికి గాయాలు, సంఘటన స్థలంలో కోటి రూపాయల విలువ గల బంగారం, స్వాధీనం చేసుకున్న పోలీసులు
Road accident (image use for representational)

Hyderabad, Feb 23: పెద్దజిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (car accident in peddapalli) జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి ( jewellery business men died ) చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు బంగారు వ్యాపారులుగా గుర్తించారు. సంఘటన స్థలంలో కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతి చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబులుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని సంతోష్ కుమార్, సంతోష్‌లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాగా వీళ్లంతా బంగారం అమ్మడానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అనుమానం..కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు, మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణం, తల్లి హత్య..తండ్రి జైలుకు వెళ్లడంతో బిక్కుబిక్కుమంటున్న రోదిస్తున్న పిల్లలు, జగిత్యాలలో విషాద ఘటన

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు ప్రస్తుతం గోదావరిఖనిలో చికిత్స పొందుతున్నారు. 108 సిబ్బంది ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్‌ఐ శైలజకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.