IPS Officer RS Praveen Kumar (Photo-Video grab)

Hyderabad, july 21: మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి (karimnagar munciff megistrate ) ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌పై (Former IPS RS praveen kumar) ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనను విధుల నుంచి రిలీవ్‌ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఐఏఎస్‌ అధికారి రోనాల్డ్‌ రాస్‌కు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ, 26 ఏళ్ల సర్వీసు చాలా సంతృప్తిని ఇచ్చిందని లేఖలో వెల్లడి

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.