IPS Officer RS Praveen Kumar (Photo-Video grab)

Hyderabad, July 19: ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్‌ పదవికి రాజీనామా (RS Praveen Kumar Resigns) చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌- వీఆర్‌ఎస్‌) కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (Telangana IPS Officer RS Praveen Kumar) కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా 26 ఏళ్లపాటు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవీ విరమణపై ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపినట్లు తెలిపారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ (Dr. RS Praveen Kumar) ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న విషయం తెలిసిందే.

కోకాపేట భూముల వేలంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, కోకాపేట భూముల సందర్శన, ధర్నాకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్

ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్‌ కోరడం హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను ప్రవీణ్‌ కుమార్‌ బహిర్గతం చేశారు.

నన్ను చంపేందుకు కుట్ర పన్నారు, ప్రజాదీవెన పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, దుబ్బాక సీన్ హుజూరాబాద్‌లో రిపీట్ అవుతుందని తెలిపిన తెలంగాణ మాజీ మంత్రి

26 ఏళ్ల పాటు పోలీస్‌ విభాగంలో పని చేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రవీణ్‌ కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Here's Telangana IPS Officer RS Praveen Kumar Tweet

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌లో జన్మించిన ప్రవీణ్ కుమార్.. 2002 నుంచి 2004 వరకు కరీంనగర్‌ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రవీణ్ కుమార్ హయాంలో ఒకేసారి 45మంది జనశక్తి మావోయిస్టులు లొంగిపోయారు. సంకల్పం, సంజీవని, కాలే కడుపుకి బుక్కెడు అన్నం, మావోయిస్టుల బాధిత సంఘం, టీచర్లు మా ఊరికి రండి, మా ఊరిగోసలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన హాయలోనే మంథని, కాటారం, మహదేవ్ పూర్ లో సంచలన ఎన్ కౌంటర్లు జరిగాయి.