Karimnagar, January 27: తెలంగాణాలో కరీంనగర్ కింగ్ (Karimnagar) ఎవరు కాబోతున్నారనేది మరి కొద్ది సేపట్లో తేలిపోనుంది. ఉదయం 7గంటల నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Municipal Corporation)ఎన్నికల కౌంటింగ్ పక్రియ ప్రారంభం అయ్యింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 58 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది.
మొత్తం 4 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తం 58 టేబుల్స్ ఏర్పాటు చేయగా… 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించింది. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభం అయ్యింది. కాగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా… రెండు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
58 డివిజన్లకు ఎన్నికలు, మరో మూడు చోట్ల రీపోలింగ్ ప్రారంభం, రేపే ఫలితాలు
ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగ్గా 25న ఫలితాలు వెల్లడవుతాయని ఎన్నికల సంఘం ప్రకటించిది. అయితే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కరీనంగర్ కార్పోరేషన్ ఎన్నికలు ఈ 24న నిర్వహించారు. నేడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ 62.19 శాతం పోలింగ్ నమోదైంది.
కరీంనగర్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్ (TRS) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్ ప్రజలపైనా తమకు నమ్మకముందని చెబుతున్నారు. అయితే ఈసారి కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ (BJP)నేతలు ధీమాగా ఉన్నారు.