Hyderabad, August 1: సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు, దేశంలో, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై ఈ భేటీలో చర్చించారు. అలాగే పలు కీలక నిర్ణయాలు (KCR Govt taken Key decisions) తీసుకున్నారు.
జిల్లాల వారీగా కరోనా స్థితిగతులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల సమాచారాన్ని అధికారులు కేబినెట్ ముందుంచారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్ (Telangana Cabinet Meeting) ఆదేశించింది. జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశాం. ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
అదేవిధంగా రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతోపాటు పత్తిసాగుపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ పత్తికి ప్రత్యేక డిమాండ్ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్య శాఖ కార్యదర్శిని మంత్రిమండలి ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమచారం సేకరించాలని స్పష్టం చేసింది.ఇక, రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల పరిస్థితులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ సభ్యులుగా నియమించారు.
కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వైద్య కళాశాలలకు భవనాలు, హాస్టళ్లు, మౌలికవసతుల కల్పనపై కేబినెట్ చర్చించింది. భవిష్యత్‌లో మంజూరయ్యే వైద్య కళాశాలలకు స్థలాలు చూడాలని ఆదేశించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై చర్చించారని చెబుతున్నారు.
Here's TS CMO Tweet
వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్.బి. నగర్ గడ్డి అన్నారం, ఆల్వాల్ లలో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశం. పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేసిన కేబినెట్.
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం.
రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. pic.twitter.com/e7jOZI5Ftr
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021
సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, పురోగతి పై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీనగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లలోసూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం.. కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ను కేబినెట్ మంజూరు చేసింది.
అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఇకనుంచి... ‘‘ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ’’ (TIMS) గా నామకరణం చేశారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్క చోటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని, సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
Here's TS CMO Tweet
అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను ఇక నుంచి ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ (TIMS) గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ ఆదేశం.
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021
అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు టిమ్స్‌గా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్, చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్, ఆల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రకాల వైద్య సేవలు ఒక్కచోటే అందేలా సమీకృత వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.