Hyderabad, Nov 27: ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister MallaReddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఆస్తులపై ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వస్తే ఐటీ రైడ్స్ ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాకపోతే, సంపాదించిన దానికి కొంత పన్ను చెల్లించేలా కేసీఆర్ కొత్త నిబంధనలు తీసుకువస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) వచ్చాక దేశంలో ఆదాయపన్నును హేతుబద్ధీకరిస్తామని అన్నారు. తన వెంట కేసీఆర్ ఉన్నారని, దాడులకు తాను భయపడనని చెప్పారు.
ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దేశంలోని పలు ప్రాంతాల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
మరో మూడు నెలల పాటు దాడులు (IT Raids) కొనసాగే అవకాశం ఉందని ఇటీవలే మల్లారెడ్డి అన్నారు. అలాగే, సమీప భవిష్యత్తులో తమ పార్టీ నేతల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులతో పాటు, ఈడీ, సీబీఐ దాడులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.