KTR (Credits: X)

Hyderabad, Jan 8: ఫార్నులా ఈ-కారు రేసు (Formula E Car Race Case) కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పిటిషన్ వేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ అధికారులు ఇప్పటికే నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరుకాకుండానే కేటీఆర్ ఓసారి వెనుదిరిగారు. దీంతో ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ క్రమంలోనే విచారణకు తన లాయర్ ను కూడా అనుమతించాలని కేటీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు.

విశాఖలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే (వీడియో)

సుప్రీంకు కేటీఆర్

కాగా ఏసీబీ పిటిషన్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏసీబీ, ఈడీ నోటీసులకు వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరిస్తానంటున్న కేటీఆర్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం గమనార్హం.

సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి